Sat Sep 21 2024 00:46:03 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర అగ్ని ప్రమాదం : పది మంది మృతి
న్యూజిలాండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు.
న్యూజిలాండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. ఒక హాస్టల్లో జరిగిన ప్రమాదంలో పది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్లో జరిగిన అగ్నప్రమాదంలో అనేక మంది గాయాలపాలయ్యారు. వీరిందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఒక హాస్టల్లో...
ఒక హాస్టల్్లో మొత్తం వంద మంది వరకూ ఉన్నారని చెబుతున్నారు. ఒక్కసారిగా ఈ భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో పొగకు ఊపిరాడక కొందరు మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. కొందరు ప్రమాదం జరిగిన వెంటనే భయంతో పరుగులు తీసినా అప్పటికే మంటలు చుట్టుముట్టడంతో వారిని రక్షించలేకపోయారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Next Story