Sun Dec 22 2024 23:20:25 GMT+0000 (Coordinated Universal Time)
దొంగిలించారని.. గుండు కొట్టించి?
శంషాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులకు గుండుకొట్టించారని స్థానికులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
శంషాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులకు గుండుకొట్టించారని స్థానికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాటరీలను దొంగతనం చేస్తున్నారన్న ఆరోపణలపై ఖుద్దూస్, ఖాజా అనే యువకులను స్థంభానికి కట్టేసి గుండు కొట్టించారు. ఈ సంఘటన పై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో బ్యాటరీలు చోరీకి గురవుతున్నాయి.
పోలీసులకు ఫిర్యాదు....
దీనిని గమనించిన స్థానిక యువకులు కొందరు ఖాజా ఇంట్లో తనిఖీ చేయగా కొన్ని బ్యాటరీలు లభ్యమయ్యాయి. బ్యాటరీలు దొంగిలించింది వీరేనని భావించి ఖాజా, ఖుద్దూస్ లను స్థంభానికి కట్టేసి గుండు కొట్టించారు. ఈ ఘటనపై ఆ యువకులిద్దరూ ఎయర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- shamshabad
- theft
Next Story