Mon Dec 23 2024 06:45:29 GMT+0000 (Coordinated Universal Time)
అన్న వరస అని చెబుతున్నా .. వినకుండా?
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని యువతిని కారు తో ఢీకొట్టిన సంఘటన జరిగింది.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని యువతిని కారు తో ఢీకొట్టిన సంఘటన జరిగింది. కంబదూరు మండలం బోయలపల్లిలో ఈ ఘటనల చోటు చేసుకుంది. నిందితుడు భాస్కర్ గా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే చికిత్స పొందుతున్న యువతి అసలు విషయం చెప్పడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
కారుతో ఢీకొట్టి...
అయితే భాస్కర్ తనకు అన్న వరస కావడంతో ప్రేమకు నిరాకరించింది. అయితే అందుకు ఒప్పుకోని భాస్కర్ కారుతో యువతి వెళుతున్న స్కూటీతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుడు భాస్కర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Next Story