Mon Dec 23 2024 10:58:22 GMT+0000 (Coordinated Universal Time)
నిమజ్జనం : వేర్వేరు చోట ముగ్గురి మృతి
హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో హైదరాబాద్ లో ముగ్గురు మృతి చెందారు.
హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో హైదరాబాద్ లో ముగ్గురు మృతి చెందారు. దీంతో నిమజ్జనం వేళ విషాాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం వేళ ఈసారి లక్షల సంఖ్యలో విగ్రహాలు ట్యాంక్ బండ్ కు చేరుకోవాల్సి ఉంది. అందరూ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేయడానికి తరలి వస్తుండటంతో ఇప్పుడు కూడా నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. పోలీసులు రాత్రంతా పహరా కాస్తూనే ఉన్నారు.
ట్రాక్టర్ కింద పడి...
అయితే వేర్వేరు చోట ముగ్గురు మృతి చెందిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇబ్రహీంపట్నంలో ట్రాక్టర్ కింద పడి ఒక బాలుడు మృతి చెందాడు. అలాగే సంజీవయ్య పార్కు వద్ద నిమజ్జనానికి వెళుతున్న లారీ కింద పడి ఒక యువకుడు మరణించాడు. దీంతో పాటు బహీర్ బాగ్ ఫ్లై ఓవర్ వద్ద లారీ కింద పడి మరొక నాలుగేళ్ల బాలుడు మృతి చెందారు. పోలీసులు ఈ వేర్వేరు ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం వరకూ పోలీసులు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరికొద్ది గంటల్లో నిమజ్జనం ముగిసే అవకాశముంది.
Next Story