Mon Dec 23 2024 02:06:20 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లింట విషాదం.. వధూవరుల మృతి
పెళ్లింట విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో కొత్తగా పెళ్లి చేసుకన్న వధూవరులు ఇద్దరూ మృతి చెందారు
పెళ్లింట విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో కొత్తగా పెళ్లి చేసుకన్న వధూవరులు ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఇచ్ఛాపురానికి చెందిన వేణు, ఒడిశా బరంపురానికి చెందిన ప్రవలిక వివాహం జరిగింది. సోమవారం వరుడు స్వగృహంలో పెద్దలు విందు ఏర్పాటు చేశారు. వివాహం విశాఖపట్నంలోని సింహాచల దేవస్థానంలో జరిగింది.
వరుడు ఇంటికి వెళుతుండగా...
వధువు స్వగృహానికి వధూవరులిద్దరూ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఆంధ్ర - ఒడిశా బోర్డర్ లోని గొలంత్ర గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరుడు వేణు, వధువు ప్రవలిక మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story