Wed Jan 15 2025 04:33:52 GMT+0000 (Coordinated Universal Time)
"మా" కార్యాలయంలో చోరీ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో దొంగలు పడ్డారు. ఫిల్మ్ నగర్ లో ఉన్న మా అసోసియేషన్ కార్యాలయంలో చోరీ జరిగింది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో దొంగలు పడ్డారు. ఫిల్మ్ నగర్ లో ఉన్న మా అసోసియేషన్ కార్యాలయంలో చోరీ జరిగింది. దీనిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో మా అధ్యక్షుడు మంచు విష్ణు మేనేజర్ సంజయ్ ఫిర్యాదు చేశారు. ఐదు లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరికి గురయినట్లు గుర్తించారు.
పోలీసులకు ఫిర్యాదు...
అయితే ఈ చోరీ జరిగినప్పటి నుంచి హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను కన్పించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ చోరీ వెనక అతను ఉండి వచ్చని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.
Next Story