Tue Dec 24 2024 00:12:00 GMT+0000 (Coordinated Universal Time)
మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
మల్లారెడ్డి కాలేజీ.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందినది కావడంతో.. కాలేజీ యాజమాన్యం విద్యార్థిని మృతిని గోప్యంగా..
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న శ్రావణి (20)అనుమానాస్పద స్థితిలో మరణించింది. నిజామాబాద్ కు చెందిన శ్రావణి.. కాలేజీ హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరికి వేలాడుతూ కనిపించింది. శ్రావణిని చూసిన తోటి విద్యార్థినులు పోలీసులకు సమాచారమివ్వగా.. పోలీసులు శ్రావణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కాగా.. మల్లారెడ్డి కాలేజీ.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందినది కావడంతో.. కాలేజీ యాజమాన్యం విద్యార్థిని మృతిని గోప్యంగా ఉంచిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు శ్రావణిది.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి మొబైల్ తో పాటు.. ఇతర ఆధారాలను సేకరించి, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఇతర విద్యార్థులు కాలేజీ వద్ద ఆందోళన చేసే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాటు చేశారు.
Next Story