Sun Dec 22 2024 18:58:58 GMT+0000 (Coordinated Universal Time)
ఈ జంట కనిపిస్తే జాగ్రత్త.. చైన్ కొట్టేస్తారు అలర్ట్
బైక్ పై వచ్చిన ఈ యువజంట ఒంటరిగా వెళుతున్న మహిళల మెడల్లో నుంచి చైన్ ను లాగేసుకుంటుంది
ఒక యువ జంట చైన్ స్నాచింగ్లకు పాల్పడుతుంది బైక్ పై వచ్చిన ఈ యువజంట ఒంటరిగా వెళుతున్న మహిళల మెడల్లో నుంచి చైన్ ను లాగేసుకుంటుంది. యవకుడు బైక్ నడుపుతుండగా, యువతి మాత్రంమహిళ మెడల్లో నుంచి చైన్ లను తెంపుకుని పారిపోతున్నారు. ఈ జంట కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
లవర్స్ గా ఉన్న వీరు...
ఈ ఇద్దరు లవర్స్ గా పోలీసులు గుర్తించారు. నల్లగొండ జిల్లాలో ఈ యువజంట చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. వీరి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. చైన్ స్నాచింగ్ చేసి వంద కిలో మీటర్ల వేగంతోఈ జంట పరారవుతుంది.
Next Story