Mon Dec 23 2024 17:40:02 GMT+0000 (Coordinated Universal Time)
దగ్గుమందు వికటించి ముగ్గురు చిన్నారులు మృతి
దగ్గుమందు వికటించి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాలుగు నెలల
దగ్గుమందు వికటించి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి ఆస్పత్రిలో 16 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ విచారణ చేపట్టగా.. ఆ కమిటీ సోమవారం రిపోర్టును వెల్లడించింది. దగ్గు మందు వికటించడంతోనే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు తమ విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వం ఆమోం పొందిన డెక్స్ ట్రో మెథార్పాన్ కాఫ్ సిరప్ ను చిన్నారులకు ఇవ్వడం వల్ల వారంతా అస్వస్థతకు గురైనట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ సిరప్ ను ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ సహా పలు డిస్పెన్సరీల్లో అందుబాటులో ఉందని, చిన్నారుల మృతికి కారణమవుతున్న ఈ దగ్గుమందును వెంటనే వెనక్కి తీసుకోవాలని డీజీహెచ్ఎస్ పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Next Story