Mon Dec 23 2024 02:59:31 GMT+0000 (Coordinated Universal Time)
సుక్మా జిల్లాలో కాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి
మావోయిస్టుల కాల్పుల్లో మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, డీఆర్ జీ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో పోలీసులు - మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, డీఆర్ జీ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా.. మృతుల్లో డీఆర్ జీ జవాన్లు, ఏఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారు.
జగ్గర్ గూడ డీఆర్ జీ పార్టీకి చెందిన జవాన్లు మావోయిస్టుల కూంబింగ్ కోసం వెళ్తుండగా.. ఎదురుపడిన మావోయిస్టులపై జవాన్లు కాల్పులు జరిపారు. దాంతో మావోయిస్టులు జవాన్లపైకి ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది.
Next Story