Mon Dec 23 2024 14:17:46 GMT+0000 (Coordinated Universal Time)
ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
66 కిలోమీటర్ రాయి ఎదురుగా జరిగిన ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన
మేడ్చల్ జిల్లా శామీర్ పెట్ కీసర మధ్యలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 66 కిలోమీటర్ రాయి ఎదురుగా జరిగిన ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డులో ఘట్ కేసర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి డివైడర్ పై నుంచి దూసుకొచ్చి.. ఎదురుగా వస్తున్న బొలెరో, కారును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంతో బొలెరో వాహనంలో ఉన్న ఇద్దరు, లారీ డ్రైవర్ మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం కారణంగా ఓఆర్ఆర్ పై ట్రాఫిక్ జామ్ అవ్వగా.. మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
Next Story