Mon Dec 23 2024 03:25:07 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోల మృతి
ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.
బీజాపూర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. హోరాహోరీగా సాగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరిణించారని అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
గాలింపు చర్యలు...
అయితే మరణించిన మావోయిస్టుల పేర్లు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. అయితే మావోయిస్టుల కోసం భద్రతాదళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు తీవ్రతరం చేశారని చెబుతున్నారు. మావోయిస్టులు ఇప్పటికీ అక్కడే ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల బలగాలు ఘటన స్థలికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నాయి.
Next Story