Mon Dec 23 2024 11:40:37 GMT+0000 (Coordinated Universal Time)
ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన కారు : ముగ్గురు సజీవదహనం
ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగాయి. ఊహించని పరిణామం నుంచి తేరుకునే సరికి కారు పూర్తిగా దగ్ధమయింది.
మార్కాపురం : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం మండలం తిప్పాయపాలెం దగ్గర్లో కారు టైరు పేలడంతో అదుపుతప్పి ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దాంతో ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగాయి. ఊహించని పరిణామం నుంచి తేరుకునే సరికి కారు పూర్తిగా దగ్ధమయింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ పరారైనట్లు సమాచారం. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story