Mon Dec 23 2024 09:13:54 GMT+0000 (Coordinated Universal Time)
సూర్యాపేటలో భగ్గుమన్న పాతకక్షలు.. వెంటాడి నరికేశారు
అందరూ చూస్తుండగానే.. ఇద్దరు యువకులు సంతోష్ ను పట్టుకోగా.. మరొకడు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఆపై బండరాళ్లపై..
సూర్యాపేటలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఓ వ్యక్తిని ముగ్గురు యువకులు మాటు వేసి మరీ దారుణంగా హతమార్చారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ అలియాస్ బంటి, మహేశ్, సన్నీ లకు.. తాళ్లగడ్డకు చెందిన చీకూరి సంతోష్ తో పాత గొడవలున్నాయి. ఎప్పటి నుంచో సంతోష్ ను హతమార్చేందుకు ముగ్గురు యువకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వల్ల సంతోష్ కోసం మాటువేశారు. అతను ఆ ప్రాంతానికి రాగానే.. అడ్డగించారు.
అందరూ చూస్తుండగానే.. ఇద్దరు యువకులు సంతోష్ ను పట్టుకోగా.. మరొకడు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఆపై బండరాళ్లపై సంతోష్ తలపై మోదారు. వాళ్లనలా చూస్తున్న స్థానికులు.. చివరికి ధైర్యంగా అందరూ కలిసి ముగ్గురిని అడ్డుకుని దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన సంతోష్ ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదంతా అక్కడున్న స్థానికుల్లో ఓ వ్యక్తి తన ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్ అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని.. నిందితులు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణ అలియాస్ బంటిపై దాడి చేసిన కేసులో 2021లో సంతోష్తోపాటు ఇద్దరు యువకులు జైలుకు వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి కేసును విత్ డ్రా చేసుకోవాలని పలుమార్లు హెచ్చరించినా.. అందుకు సంతోష్ ఒప్పుకోకపోవడంతో.. కృష్ణ మరో ఇద్దరితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ వివరించారు.
Next Story