Sat Dec 21 2024 05:08:40 GMT+0000 (Coordinated Universal Time)
మలక్ పేటలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై మైనర్ల లైంగిక దాడి
కొద్దిసేపటికి చిన్నారి ఏడుస్తూ కిందికి రావడంతో.. చిన్నారి పరిస్థితిని గమనించిన స్థానిక మహిళ.. ఇంటికొచ్చిన బాలిక..
మలక్ పేటలో దారుణ ఘటన జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ నుండి వలస వచ్చిన బాధిత బాలిక కుటుంబం సైదాబాద్ లోని ఊసరబస్తీలో ఉంటోంది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటికి వెళ్లగా.. పెద్ద కుమార్తె జ్వరంతో ఇంట్లోనే ఉంది. చిన్నకుమార్తె ఆరుబయట ఆడుకుంటోంది. ఆ ఇంటి పక్కన పతంగులు ఎగురవేస్తున్న ముగ్గురు బాలురు.. ఆ ఐదేళ్ల చిన్నారిని డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు.
కొద్దిసేపటికి చిన్నారి ఏడుస్తూ కిందికి రావడంతో.. చిన్నారి పరిస్థితిని గమనించిన స్థానిక మహిళ.. ఇంటికొచ్చిన బాలిక తల్లితో విషయం చెప్పింది. దాంతో ఆ చిన్నారిని తల్లి ఏమైందమ్మా అని అడగగా.. ఆ మైనర్లు చేసిన తంతును వివరించింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించి, జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఒకరి వయసు 16 ఏళ్లు కాగా మరొకరి వయసు 11, మరో బాలుడి వయసు 9 సంవత్సరాలని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపైనా పోక్సో యాక్ట్, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. చిన్నారిని భరోసా కేంద్రానికి తరలించామని తెలిపారు.
Next Story