Mon Dec 23 2024 10:20:59 GMT+0000 (Coordinated Universal Time)
ముగ్గురు పాక్ స్మగ్లర్లు అరెస్ట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు స్మగ్లర్లను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిని తనిఖీ..
పాకిస్థాన్ నుంచి భారత్ కు భారీగా డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. ఇటీవల కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువవ్వడంతో.. భారత భద్రతా దళాలు సరిహద్దుల్లో సంచరించే వారిపై నిఘా పెంచింది. తాజాగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు స్మగ్లర్లను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిని తనిఖీ చేయగా.. 36 కేజీల వరకూ డ్రగ్స్ లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
Also Read : భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
కాశ్మీర్ సరిహద్దుల ద్వారా పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు స్మగ్లర్లు చొరబాటుకు యత్నించగా.. వారిని భద్రతా బలగాలు గుర్తించి, అదుపులోకి తీసుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
Next Story