Wed Jan 08 2025 22:01:32 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో అగ్ని ప్రమాదం.. ముగ్గురి మృతి
తిరుపతిలోని ఒక ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
తిరుపతిలోని ఒక ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రేణిగుంటలోని భగత్సింగ్ కాలనీలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ కార్తీక చిన్న పిల్లల ఆసుపత్రి ఉంది. దీనిని కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన రవిశంకర్ రెడ్డి కుటుంబం నిర్వహిస్తుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో మొదటి అంతస్థులో నివాసం ఉంటున్న డాక్టర్ కుటుంబం చిక్కుకుని పోయింది. వీరిని రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నమే చేశారు.
నిద్రలో ఉండగానే...
అయితే ఈ ప్రమాదంలో డాక్టర్ రవిశంకర్ రెడ్డి మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. ఆయన వేరే గదిలో నిద్రిస్తున్నారు. మొదటి అంతస్థులో రవిశంకర్ రెడ్డి భార్య, ఇద్దరు పిల్లలు, అత్త ఉంటున్నారు. వీరందరినీ అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకు వచ్చారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొడుకు సిద్ధూ, కార్తీక మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Next Story