Mon Dec 23 2024 08:08:02 GMT+0000 (Coordinated Universal Time)
చెరువులో మునిగి ముగ్గురు అక్కా చెల్లెళ్ల మృతి
చెరువులో పడి ముగ్గురు అక్కా చెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది
చెరువులో పడి ముగ్గురు అక్కా చెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. తిరుపతి జిల్లాలోని ఎస్.బి.ఆర్ పురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ బాబుకు ముగ్గురు కుమార్తెలున్నారు. వీరు ముగ్గురు అరుణాచల దర్శనానికి గురువారం వెళ్లారు. వీరి తల్లి విజయశాంతి ముగ్గురు కుమార్తెలైన మూషిక, చరిత, రూషికతో కలసి గూళూరు చెరువు కట్టపై ఉన్న పురాతన శివాలయంలో దీపారాధన చేసేందుకు వెళ్లారు.
దీపాలను వదులుతుండగా...
అక్కడ చెరువులో దీపాలను వదిలేందుకు మెట్లమార్గం ద్వారా కిందకు తిగి కాళ్లు కడుక్కునేందుకు ప్రయత్నిస్తుండగా మెట్లు జారి అందరూ చెరువులో పడిపోయారు. అయితే స్థానికులు వెంటనే తల్లి విజయశాంతిని కాపాడగా ముగ్గురు పిల్లలు మాత్రం మరణించారు. మృతదేహాలను పుత్తూరు ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Next Story