Mon Dec 23 2024 11:48:33 GMT+0000 (Coordinated Universal Time)
పుట్టినరోజు విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి
ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది
ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిర్యాల్ చెరువలో పడి ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఇద్దరు విద్యార్థుల బర్త్ డే సందర్భంగా తొమ్మిది విద్యార్థులు కలసి చిర్యాల్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకున్నంత అనంతరం చిర్యాల్ లో ఉన్న నాట్యం చెరువులో ఈతకు వెళ్లారు.
ఈతకు వెళ్లి...
ీఇందులో ముగ్గురు విద్యార్థులు చెరువులో గల్లంతయ్యారు. మిగిలిన విద్యార్థులు చూస్తుండగానే వారు మునిగిపోవడంతో వారు కేకలు పెట్టారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడిచేరుకుని బాలాజీ మృతదేహాన్ని బయటకు తీశారు. వీరంతా తీగల కృష్ణారెడ్డి కళాశాలల డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్నారు. మిగిలిన ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చనిపోయిన వారిని బాలాజీ, ఉబేద్, హరిహరన్ గా గుర్తించారు.
Next Story