Wed Jan 15 2025 11:25:13 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు యాక్సిడెంట్... ఏపీకి చెందిన ముగ్గురు యువకుల మృతి
హైదరాబాద్ లో మద్యం మత్తులో కారు డ్రైవిగ్ చేసి ఆగిఉన్న లారీని ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు
హైదరాబాద్ లో మద్యం మత్తులో కారు డ్రైవిగ్ చేసి ఆగిఉన్న లారీని ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు. ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాద్ వచ్చి శనివారం రాత్రి మద్యం తాగి కారును లారీకి ఢీకొట్టారు. అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బౌరంపేటలో ఈ ఘటన జరిగింది.
ఉద్యోగ ప్రయత్నాల కోసం....
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు, విజయవాడకు చెందిన సంజూ, గణేష్, చరణ్ లు ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాద్ వచ్చారు. నిజాంపేట్ లో ఉంటూ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరు శనివారం రాత్రి మద్యం తాగి కారులో ప్రయాణిస్తూ లారీని ఢీకొట్టడంతో మృతి చెందారు. అతివేగంతో వచ్చి లారీని ఢీకొట్టడంతోనే మృతి చెందారని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన అశోక్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Next Story