Tue Nov 05 2024 16:48:11 GMT+0000 (Coordinated Universal Time)
ఈతకువెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి
వాగును చూసి.. అందులో స్నానం చేద్దామని దిగారు. విద్యార్థులు వాగులోకి దిగడాన్ని గమనించిన రైతులు వారిని గద్దించి, అక్కడి..
టంగుటూరు : ఈతకువెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం. నిడమానూరులో చోటుచేసుకుంది. ఆదివారం అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు.. మూసీ నదిలో విగతజీవులుగా కనిపించడంతో.. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. వాసు(15), జగన్ (12), మహేశ్ (13) లు నిడమానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఆదివారం స్కూల్ కి సెలవు కావడం మధ్యాహ్నం వేళ క్రికెట్ ఆడేందుకు పొందూరు పంచాయతీ పొదవారిపాలెం సమీపంలోని మూసీ వాగు వద్దకు వెళ్లారు.
Also Read : రూ.100 కోట్ల క్లబ్ లోకి "వాలిమై"
వాగును చూసి.. అందులో స్నానం చేద్దామని దిగారు. విద్యార్థులు వాగులోకి దిగడాన్ని గమనించిన రైతులు వారిని గద్దించి, అక్కడి నుంచి పంపించేశారు. కానీ.. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ తెలియలేదు. పిల్లల్ని మూసీ వాగువద్ద చూసినట్లు ఎవరో చెప్పగా.. అక్కడికి వెళ్లి చూశారు. అయినా పిల్లలు కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. గజఈతగాళ్లతో వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయానికి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. బిడ్డలను విగతజీవులుగా చూసిన తల్లులు.. గుండెలవిసేలా రోధిస్తున్నారు. ముగ్గురు విద్యార్థుల మృతితో నిడమానూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story