Mon Dec 23 2024 08:44:14 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. విషం తాగి ఆరుగురు బాలికల ఆత్మహత్యాయత్నం
వీరిలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స తీసుకుంటున్న బాలికల పరిస్థితి కూడా
ఔరంగాబాద్ : ఆరుగురు బాలికలు ఒకేసారి విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన విషాద ఘటన బీహార్ లోని ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. వీరిలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స తీసుకుంటున్న బాలికల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కాస్మా ప్రాంతానికి చెందిన ఆరుగురు బాలికలు మంచి స్నేహితులు. వారిలో ఒక బాలిక ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. కానీ.. అతను పెళ్లికి నిరాకరించాడు. దాంతో మనస్తాపానికి గురైన బాలిక విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
తమ స్నేహితురాలు ఆత్మహత్యకు పాల్పడటం చూసి.. మిగతా ఐదుగురు బాలికలూ విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు బాలికలు మగధ్ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు. యువకుడిని ప్రేమిస్తున్న బాలిక తొలుత విషం తాగిందని, అది చూసి మిగతా ఐదుగురు కూడా విషం తాగారని ఔరంగాబాద్ ఎస్పీ కాంతేశ్ కుమార్ మిశ్రా తెలిపారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన ఆ బాలికల వయసు 12 నుంచి 16 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story