Mon Dec 23 2024 23:01:17 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. రెండు వాహనాలు ఢీ కొని ముగ్గురు మృతి
ఆ రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఒకదానినొకటి ఢీ కొట్టడంతో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ రోడ్డుప్రమాదం
పండుగ వేళ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిలింది. ఓ రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. ఆనందంగా సంక్రాంతి సంబురాలు జరుపుకోవాల్సిన వేళ.. ఆ ఇళ్లల్లో రోదనలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని 5వ మైలు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మరణించారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వాల్మీకి పురం మండలం చింతపర్తి, మదనపల్లె మండలం కొత్తవారిపల్లెకు చెందిన వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు.
ఆ రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఒకదానినొకటి ఢీ కొట్టడంతో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ రోడ్డుప్రమాదం శుక్రవారం రాత్రి జరుగగా.. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ముగ్గురూ శనివారం మృతి చెందారు. మృతులు ఇస్మాయిల్, సిద్ధిక్, శ్రీనివాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. ముగ్గురి మృతితో రుయా ఆస్పత్రి మార్చురీ వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.
Next Story