Mon Dec 23 2024 07:17:19 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మహిళల మృతి
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మహిళలు మరణించిన ఘటన విషాదం నింపింది
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మహిళలు మరణించిన ఘటన విషాదం నింపింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ లో జరిగింది. చిన్న బొకూర్ గ్రామానికి చెందిన మల్యాల వెంకటేశ్ మియాపూర్ గ్రామం చివర్లో ఉన్న తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న కంకుల పొట్టు తీయడానికి సొంత ట్రాక్టర్లో తన భార్యతో పాటు ఎనిమిది మంది మహిళ కూలీలను తీసుకెళ్లారు.
తిరిగి వస్తుండగా...
పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఎస్సారెస్పీ కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో పోచంపల్లి రాజమ్మ, భేతి లక్ష్మి అక్కడికక్కడే మరణించగా, వెంకటేశ్ భార్య వైష్ణవికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. మిగిలిన కూలీలకు గాయాలయ్యాయి. వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story