Sun Dec 22 2024 16:49:54 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో దారుణం.. సొంత మామే
తిరుపతిలో చిన్నారిపై జరిగిన హత్యాచారంపై
తిరుపతిలో చిన్నారిపై జరిగిన హత్యాచారంపై ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. చిన్నారి మామ నాగరాజు అలియాస్ సుశాంత్‌ను నిందితుడని పోలీసులు తెలిపారు. చాక్లెట్స్ కొనిస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడని ఎస్పీ సుబ్బారాయుడు వివరించారు. మూడున్నరేళ్ల బాలికకు చాక్లెట్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారిని హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టేశాడు.
వడమాట పేట మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సుశాంత్ (22) తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఓ దుకాణంలో తినుబండారాలు కొనిచ్చి సమీప పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను చంపేసి అక్కడే పూడ్చిపెట్టేశాడు. రాత్రి అవుతున్నప్పటికీ పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వడమాల పేట మండలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అనుమానితుడు సుశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా జరిగిన విషయం తెలిపాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారి మృత దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సుశాంత్‌పై పోక్సో చట్టం కింద కేసు, మర్డర్ కేసులతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు.
Next Story