Sun Dec 22 2024 21:46:34 GMT+0000 (Coordinated Universal Time)
Vianayaka Pandals: వినాయక మండపాల దగ్గర అశ్లీల నృత్యాలు చేస్తే అరెస్టులే!!
తిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు
తిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు చేసిన వ్యక్తులను ఏడుగురు అరెస్టు చేశారు. సప్తగిరి నగర్ లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతీ, యువకులు అశ్లీల నృత్యాలు చేశారు. ఈ ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఏడుగురును అరెస్టు చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలకు తావు లేదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు హెచ్చరించారు.
వినాయక చవితి సందర్భంగా పలు ప్రాంతాల్లో మండపాలు వేస్తుంటారు. కొందరు గట్టిగా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే అలా డ్యాన్స్ ఎంతసేపంటే అంత సేపు ఎందుకు చేస్తావు. ఇంటికి వచ్చేయమని సోదరుడు, తల్లి కోరడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. చిక్కబళ్లాపుర తాలూకా చిక్కపాయలగుర్కి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గిరీష్ (21) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ రాత్రి 11 గంటల వరకూ కూడా గిరీష్ ఇంటికి రాలేదు. దీంతో సోదరుడు, తల్లి వచ్చి ఇంటికి రమ్మని పిలిచారు. అందరి ముందూ గిరీష్ ను పిలవడంతో ఆగ్రహానికి గురైన గిరీష్ గ్రామ శివారులోని ముత్తురాయస్వామి దేవాలయం సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు ఉదయం పొలానికి వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహం కనిపించింది. పేరేసంద్ర పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story