Sat Nov 23 2024 03:54:57 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కేసు...ఆ వ్యాపారవేత్తలను విచారిస్తేనే?
డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఏడుగురు వ్యాపారవేత్తలను కస్టడీకి అనుమతించాలని నేడు పోలీసులు హైకోర్టును ఆశ్రయించనున్నారు.
హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ కేసుపై స్పీడ్ పెంచారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన సమావేశం తర్వాత డ్రగ్స్ కేసులో ఎవరిని వదిలిపెట్టకుండా విచారణ చేసేందుకు సిద్ధమయ్యారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఏడుగురు వ్యాపారవేత్తలను కస్టడీకి అనుమతించాలని నేడు పోలీసులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. వారిని కస్టడీకి అనుమతిస్తే మరింత సమాచారాన్ని రాబట్ట వచ్చన్నది పోలీసులు పిటీషన్ లో పేర్కొన్నారు.
టోని నుంచి...
ముంబయి నుంచి డ్రగ్స్ ను సరఫరా చేసే టోనీ నుంచి కొంత సమాచారం రాబట్టారు. ఈ ఏడుగురు వ్యాపారవేత్తలు నిర్వహించిన పార్టీల్లో డ్రగ్స్ వినియోగించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆరా తీయాలంటే కస్టడీకి వారిని అనుమతించాలని కోరుతున్నారు. ప్రస్తుతం పట్టుబడిన వ్యాపారవేత్తలు ఏడుగురు వార్షిక టర్నోవర్ వెయ్యి కోట్ల రూపాయలు అని పోలీసులు చెబుతున్నారు. టోనీ హైదరాబాద్ లో మొత్తం 32 మందికి డ్రగ్స్ విక్రయించారని చెబుతున్నారు. సినిమా, సాఫ్ట్ వేర్ రంగంలోని వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రేపటి నుంచి పోలీసులు టోనిని విచారిస్తారు.
Next Story