Fri Dec 20 2024 16:48:11 GMT+0000 (Coordinated Universal Time)
తాబేళ్ల అక్రమ రవాణా.. వ్యాన్ సీజ్, ముగ్గురు అరెస్ట్
కాదేదీ స్మగ్లింగ్ కు అనర్హం అన్నట్లుగా.. ఎర్రచందనం, గంజాయి, వన్యప్రాణులు.. ఇలా ప్రతి దానిని స్మగ్లింగ్..
కైకలూరు : తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకీ క్రైం (స్మగ్లింగ్) రేటు పెరిగిపోతోంది. కాదేదీ స్మగ్లింగ్ కు అనర్హం అన్నట్లుగా.. ఎర్రచందనం, గంజాయి, వన్యప్రాణులు.. ఇలా ప్రతి దానిని స్మగ్లింగ్ చేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా అక్రమార్కులు అనేక రకాలుగా స్మగ్లింగ్ చేస్తుంటారు. కానీ.. పోలీసుల కళ్లుగప్పి ఏదీ చేయలేమని ఇలాంటి ఘటనలు చూశాకే వారికీ అర్థమవుతుంది. తాజాగా తాబేళ్ల అక్రమ రవాణా చేస్తూ.. పోలీసులకు పట్టుబడ్డారు స్మగ్లర్లు.
Also Read : అనంతలో జింక మాంసం కలకలం.. వ్యక్తి అరెస్ట్
కృష్ణాజిల్లా కైకలూరు నుంచి తాబేళ్లను అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. సాధారణంగా గోనె సంచుల్లో సరుకులు, వస్తువులు తరలిస్తారు. కానీ ఇక్కడ.. ఏకంగా తాబేళ్లను గోనె సంచుల్లో వేసి తరలించేందుకు ప్రయత్నించారు. తనిఖీల్లో భాగంగా వాహనాన్ని చెక్ చేసిన పోలీసులకు, గోనె సంచులు కదలడంతో.. అనుమానం వచ్చింది. అందులో ఏముందా అని తీసి చూడగా.. షాక్ అవ్వడం పోలీసుల వంతైంది. 25 గోనె సంచుల్లో 500 తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దాంతో మినీ వ్యాన్ డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నారు.
Next Story