Sun Dec 22 2024 13:02:49 GMT+0000 (Coordinated Universal Time)
పారా గ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ వాసి మృతి
హిమాచల్‌ప్రదేశ్‌లో పారా గ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన ఒక పర్యాటకుడు మృతి చెందడం విషాదం కలిగించింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో పారా గ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన ఒక పర్యాటకుడు మృతి చెందడం విషాదం కలిగించింది. హిమాచల్‌ప్రదేశ్ కులూలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీట్ బెల్ట్‌ను తనిఖీ చేయకుండానే పారా గ్లైడింగ్ అనుమతించడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించి పైలట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పైలట్ నిర్లక్ష్యమే...
అయితే పారా గ్లైడింగ్ చేసిన ప్రాంతానికి, ఎక్విప్మెంట్కు అనుమతి ఉందని, పైలట్ కూడా రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నాడని, అయితే సేఫ్టీ బెల్ట్ ను తనిఖీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఈ ఘటన చోటు చేసుకుందని కులూ పర్యాటక శాఖ అధికారి సునైన శర్మ తెలిపారు. ఎలాంటి వాతావరణ సమస్యలు లేవని, అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో పారా గ్లైడింగ్ ను రద్దు చేసినట్లు తెలిపారు. అయితే మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story