Sun Dec 22 2024 22:08:32 GMT+0000 (Coordinated Universal Time)
ఎంతటి విషాదం.. రెప్పపాటులో రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్ల మృతి
మేడ్చల్ లో విషాదం నెలకొంది. గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొని ముగ్గురు చనిపోయారు.
మేడ్చల్ లో విషాదం నెలకొంది. గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొని ముగ్గురు చనిపోయారు. రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన కృష్ణ రైల్వే శాఖలో లైన్ మెన్ గా పనచేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో తన ఇద్దరు కుమార్తెలు వర్షిణి, అమృతలను తీసుకుని రైలు ట్రాక్ పనికి వెళ్లాడు. అక్కడ తాను ట్రాక్ పనులు చేస్తుండగా పిల్లలిద్దరూ రైల్వే లైను పై ఆడుకుంటున్నారు.
లైన్ మెన్ గా పనిచేస్తూ....
దీంతో రైలు వేగంగా రావడాన్ని గమనించిన కృష్ణ ట్రాక్ పై ఆడుకుంటున్న తన ఇద్డరు కుమార్తెలను కాపాడాలని వెంటనే వారి వద్దకు పరుగు తీశాడు. అయితే కృష్ణతో సహా కుమార్తెలు వర్షిణి, అమృతలను రైలు ఢీకొట్టింది. రెప్పపాటులో జరిగిన ఈఘటన ఒక కుటుంబాన్ని బలితీసుకుంది. అంతులేని విషాదం నింపింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story