Mon Dec 23 2024 10:25:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఏలూరు కాల్వలో నలుగురు గల్లంతు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం నెలకొంది. ఏలేరు కాల్వలో నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం నెలకొంది. ఏలేరు కాల్వలో నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. అనధికార ర్యాంప్ లో ఇసుక తవ్వుతుండగా నలుగురు వ్యక్తులు గల్లంతయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన నలుగురు కార్మికులు తూర్పు లక్ష్మీపురం వాసులుగా గుర్తించారు.
అడ్డతీగల పోలీసులు...
అడ్డతీగల పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నలుగురు గల్లంతు కావడంతో తూర్పు లక్ష్మీపురంలో విషాదం నెలకొంది. వారి కోసం బంధువులు ఏలూరు కాల్వ వద్ద పడిగాపులు కాస్తున్నారు. కాల్వలో నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రాణాలతో బతికే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పోలీసులు మాత్రం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story