Thu Dec 19 2024 13:54:45 GMT+0000 (Coordinated Universal Time)
కూలిన మెట్రో పిల్లర్.. ఇద్దరు మృతి
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. మెట్రో రైలు పిల్లర్ కూలి ద్విచక్ర వాహనంపై పడటంతో ఇద్దరు మరణించారు
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. మెట్రో రైలు పిల్లర్ కూలి ద్విచక్ర వాహనంపై పడటంతో ఇద్దరు మరణించారు. వెంటనే తల్లిని, బిడ్డను ఆసుపత్రిలోకి చేర్చినా ఫలితం లేదు. నాగవార - గొట్టిగెరె మార్గంలో మెట్రోలైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా పనులు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానికుల ఆందోళన...
నాగవార సమీపంలో మెట్రో పిల్లర్ కూలడంతో దాని కింద ప్రయాణిస్తున్న తల్లి, బిడ్డలు మరణించారు. గాయపడిన తండ్రి కోలుకుంటున్నారని తెలిసింది. నాగవారా రింగ్ రోడ్ లోని హెచ్బీఆర్ లే అవుట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారాన్ని చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story