Mon Dec 23 2024 06:55:05 GMT+0000 (Coordinated Universal Time)
కోడి కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి
కోడిపందేల్లో విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న కోడిపందేల్లో కత్తి గుచ్చుకుని ఒక యువకుడు మృతి చెందాడు
కోడిపందేల్లో విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న కోడిపందేల్లో కత్తి గుచ్చుకుని ఒక యువకుడు మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లాా నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఈ ఘటన జరగింది. పందెం కోడి కత్తి గుచ్చుకుని పద్మారావు అనే యువకుడు మరణించాడు.
తోపులాట జరిగి...
కోడిపందేల సందర్భంగా తోపులాట జరగడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు బరులు వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. పద్మారావు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కోడిపందేల నిర్వహణ చట్ట విరుద్ధమని తెలిసినా ఎందుకు నిర్వహించారని నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
Next Story