Mon Dec 23 2024 18:02:32 GMT+0000 (Coordinated Universal Time)
Mumbai : ఫేస్ బుక్ లైవ్ లో కాల్పులు.. ప్రత్యర్థిని చంపి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఫైస్ బుక్ లైవ్ లో మాట్లాడే వ్యక్తిని లైవ్లోనే కాల్చి చంపిన ఘటన ముంబయిలో జరిగింది
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఫైస్ బుక్ లైవ్ లో మాట్లాడే వ్యక్తిని లైవ్లోనే కాల్చి చంపిన ఘటన ముంబయిలో జరిగింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన నేత అభిషేక్ ఘోసాల్కర్ ఫేస్ బుక్ లైవ్లో మాట్టాడుతున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు అభిషేక్ పై కాల్పులు జరిపాడు. తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడు. నిందితుడు మౌరిస్ నోరాన్హగా గుర్తించారు.
లైవ్ లో మాట్లాడుతుండగా...
ఈ కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిషేక్ ఘోసాల్కర్ గతంలో కార్పొరేటర్ గా పనిచేశాడు. అదే ప్రాంతంలో నోరాన్హ సమస్యల కోసం పోరాడుతున్నాడు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయని పోలీసులు తెిపారు. ఐసీ కాలని అభివృద్ధి పనులకు సంబంధించి మాట్లాడేందుకు అభిషేక్ ను నోరాన్హ ఆహ్వానించడంతో ఆయన వెళ్లాడు.
తనను తాను కాల్చుకుని...
బోరివిల్లీ ప్రాంతంలోని ఐసీ కాలనీలోని ఆయన కార్యాాలయానికి వెళ్లిన అభిషేక్ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతుండగా నోరాన్హ కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే అభిషేక్ కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతూ ఆయన మృతి చెందాడు. అభిషేక్ ను కాల్చిన నోరాన్హ కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన ముంబయిలో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story