Thu Dec 26 2024 22:10:21 GMT+0000 (Coordinated Universal Time)
కల్తీసారా తాగి ముగ్గురి మృతి
తమిళనాడులో విషాదం చోటు చేేసుకుంది. కల్తీ సారా తాగి ముగ్గురు మృతి చెందారు. మరో పదహారు మంది పరిస్థితి విషమంగా ఉంది
తమిళనాడులో విషాదం చోటు చేేసుకుంది. కల్తీ సారా తాగి ముగ్గురు మృతి చెందారు. మరో పదహారు మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కల్తీ సారా తాగి అస్వస్థులైన వారందరినీ ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. వారిలో మరికొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
16మంది పరిస్థితి విషమం...
కల్తీ సారాకు బలవుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడులోని విల్లుపురం జిల్లా మరక్కాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్తీ సారా ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story