Fri Apr 18 2025 07:06:08 GMT+0000 (Coordinated Universal Time)
కారు లాక్ కావడంతో ఊపిరాడక చిన్నారుల మృతి
రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కారులో ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మరణించారు

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కారులో ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మరణించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువుల పెళ్లికి అనివచ్చిన తన్మయశ్రీ, అభినయశ్రీలు ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులోకి వెళ్లారు. అయితే ఆ కారులో ఆటోమేటిక్ గా లాక్ పడింది.
కారులో చిక్కుకుని...
ఎవరూ పట్టించుకోకపోవడంతో పాటు ఆ పిల్లలు అరిచినాబయటకు వినిపించకపోవడంతో ఊపిరి ఆడకచనిపోయినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు కనిపించక పోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికిన తల్లి దండ్రులకు చివరకు అచేతన వ్యవస్థలో కారులో కనిపించారరు. వెంటనే కారులో నుంచి పిల్లలను బయటకు తీసి ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే వారిద్దరూ మరణించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story