Mon Dec 23 2024 11:43:30 GMT+0000 (Coordinated Universal Time)
గచ్చిబౌలిలో కారు టెర్రర్... మహిళ మృతి
గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు ఢీకొని మహిళ మృతి చెందింది
గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు ఢీకొని మహిళ మృతి చెందింది. హోలీ రోజున ఈ విషాదం జరిగింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎల్లా హోటల్ లో పనిచేస్తున్న మహిళ చెట్లకు నీరు పడుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. మహేశ్వరి అనే మహిళ తీవ్ర గాయాలపాలయి అక్కడికక్కడే మృతి చెందింది.
మద్యం తాగి....
కారు నడిపిన వ్యక్తులు మద్యం సేవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో ఒక యువకుడితో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. కారులో ఉన్న రోహిత్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మరో యువతికి కూడా గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story