Thu Dec 19 2024 17:48:56 GMT+0000 (Coordinated Universal Time)
సాగర్ కాల్వలోకి కారు.. వైసీపీ ఎమ్మెల్యే కుటుంబంలో విషాదం
గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబంలో విషాదం అలుముకుంది

గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిన్నాన్న కుమారుడు మదన్ మోహన్ రెడ్డి భార్య , కుమార్తెలు మరణించారు. కాలువలోకి కారు దూసుకెళ్లడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
ముగ్గురి మృతి....
కారులో మదన్ మోహన్ రెడ్డి తో భార్య, కుమార్తెలు ప్రయాణిస్తున్నార. గుంటూరు జిల్లాలోని సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. నీటిలో కారు మునగడంతో మదన్ మోహన్ రెడ్డి భార్య, కుమార్తెలు మరణించారు. మదన్ మోహన్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
Next Story