Wed Dec 25 2024 02:09:50 GMT+0000 (Coordinated Universal Time)
జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే కారు బీభత్సం.. బాలుడి మృతి
హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కారు బీభత్సం సృష్టించింది
హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో ఈ ఘటన చోటు చేసుకుంది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు చెందిన కారు వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది.
కారును వదిలేసి...
ఆ మహిళ చేతిలో ఉన్న రెండున్నరేళ్ల బాలుడు కిందపడి అక్కడికక్కడే మరణించాడు. మహిళకు తీవ్రగాయాలయ్యాయి. కారును నడుపుతున్న వ్యక్తి కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి కేసు నమోదు చేశారు. కారులో ఎమ్మెల్యే లేరని, ఆయనకు చెందిన వాహనమని పోలీసులు చెబుతున్నారు.
Next Story