Sat Dec 28 2024 02:28:42 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూలులో విషాదం... మత్తులో భార్య, అత్తపై దాడి
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదోనిలో భార్య, అత్తపై దాడికి దిగాడు.
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదోనిలో భార్య, అత్తపై దాడికి దిగాడు. ఎనిమిది నెలల క్రితం మాధవి, నరేష్ లకు ప్రేమ వివాహం అయింది. పెద్దలు అంగీకరించి వీరి వివాహాన్ని అంగీకరించారు. అయితే నరేష్ తాగుడుకు బానిసై భార్యను హింసిస్తున్నాడు. దీనిని మాధవి ప్రశ్నించడంతో నరేష్ వేధిస్తున్నాడు. దీంతో మాధవి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
తీవ్రగాయాలై....
అయితే రాత్రి పుల్లుగా తాగిన నరేష్ అత్తవారింటికి వచ్చి వేటకొడవలితో దాడికి దిగాడు. ఈ దాడిలో భార్య మాధవి తలకు తీవ్రగాయాలయ్యాయి. అడ్డువెళ్లిన అత్త సావిత్రమ్మపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో సావిత్రమ్మ చెవి తెగిపోయింది. నరేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story