Mon Dec 23 2024 12:55:23 GMT+0000 (Coordinated Universal Time)
గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ అయి హెడ్ కానిస్టేబుల్ సంతోష్ మృతి చెందాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ అయి హెడ్ కానిస్టేబుల్ సంతోష్ మృతి చెందాడు. సంతోష్ ఈరోజు ఉదయం ఆయుధాలను పరిశీలిస్తుండగా గన్ మిస్ ఫైర్ అయిందని చెబుతున్నారు. మిస్ ఫైర్ లో గాయపడిన సంతోష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితమే సంతోష్ కు కుటుంబ సభ్యులు పెళ్లి చూపులు చూశారు.
ఆయుధాలను పరిశీలిస్తుండగా....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాచనపల్లి పోలీస్ స్టేషన్ లో సంతోష్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆయనది వరంగల్ జిల్లా గవిరిచర్ల స్వస్థలం. మృతి చెందిన సంతోష్ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Next Story