Thu Dec 19 2024 18:56:44 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి
గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి ఏడుగురు మృతి చెందిన ఘటన విషాదం నింపింది.
గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి ఏడుగురు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ఈతకు వెళ్లి వీళ్లంతా మరణించారు. మృతుల్లో పెద్దల నుంచి చిన్నారుల వరకూ ఉన్నారు. నర్మదానదిలో దిగిన ఏడుగురు నదీ ప్రవాహానికి కొట్టుకుపోయారు. బాధితులు సూరత్ నంచి నర్మదా పోయిచా వద్దకు పర్యాటక బృందంలో సభ్యులుగా పోలీసులు గుర్తించారు.
నదిలోకి దిగి...
ఏడుగురు ఈతకొట్టేందుకు నదిలో దిగి ప్రవాహానికి కొట్టుకుపోయారని తెలిపారు. సమ్మర్ లో పిక్నిక్ కోసం ఈ ప్రాంతానికి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. అందులో భాగంగా వచ్చి ఇక్కడ వాళ్లు నదిలో ఈత కొట్టడానికి దిగి కొట్టుకుని పోయారని, మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టానమి పోలీసులు తెలిపారు.
Next Story