Thu Mar 27 2025 08:14:52 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్ లో విషాదం.. గోడకూలి నలుగురి మృతి
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ లో గోడ కూలి నలుగురు మృతి చెందారు

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ లో గోడ కూలి నలుగురు మృతి చెందారు. రాజేంద్ర నగర్ లోని . మైలార్ దేవుపల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్లో గోడ కూలిపోయి నలుగురు మృతి చెందారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరికి గాయాలు...
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి నానిన గోడ కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు మాత్రం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Next Story