Mon Dec 23 2024 12:12:45 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బావిలో పడిన కారు.. నలుగురు మృతి
మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బావిలో పడి నలుగురు మృతి చెందారు
మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బావిలో పడి నలుగురు మృతి చెందారు. మృతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన వారుగా గుర్తించారు. కే సముద్రం బైపాస్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. అన్నారంలో ఒక ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తు చేశారు.
ఏడుగురు ప్రయాణిస్తుండగా....
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ఉన్నారు. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మిగిలిన ఇద్దరు లిఫ్ట్ అడిగారని బాధితులు చెబుతున్నారు. చీకటిగా ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నాయి. కారు పూర్తిగా బావిలో పడటంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story