Mon Dec 23 2024 02:39:01 GMT+0000 (Coordinated Universal Time)
మావోయిస్టుల చేతిలో వ్యక్తి హతం
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మావోయిస్టులు ఇన్ ఫార్మర్ పేరుతో ఒక వ్యక్తిని హత్య చేశారు
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మావోయిస్టులు ఇన్ ఫార్మర్ పేరుతో ఒక వ్యక్తిని హత్య చేశారు. మృతుడు కొండాపురానికి చెందిన గోపాల్ గా గుర్తించారు. గోపాల్ ను నరికి చంపిన మావోయిస్టులు అక్కడ లేఖ వదిలేశారు. పోలీసుల ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తే ఇదే గతి పడుతుందని మావోయిస్టులు హెచ్చరించారు.
ఇన్ ఫార్మర్ గా....
ములుగు జిల్లాలో గిరిజనుడు మావోయిస్టుల చేతిలో హత్యకు గురికావడంతో కలకలం రేగింది. పదిహేను రోజుల క్రితమే డీజీపీ ఈ ప్రాంతంలో పర్యటించి వెళ్లారు. తమ ఆనుపానులు పోలీసులకు చేరవేస్తున్నారన్న కారణంతోనే మావోయిస్టులు గోపాల్ ను అతి కిరాతకంగా చంపినట్లు తెలుస్తోంది.
Next Story