Mon Dec 23 2024 08:48:58 GMT+0000 (Coordinated Universal Time)
ఆటాడుకోవడానికి కారులోకి వెళ్లి.. డోర్ లాక్ కావడంతో బాలుడి మృతి
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బోధన్ లోని రాకాసిపేటలో బాలుడు కారులో మరణించిన సంఘటన జరిగింది
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ లోని రాకాసిపేటలో బాలుడు కారులో మరణించిన సంఘటన జరిగింది. బాలుడి కుటుంబం వాచ్మెన్ గా పనిచేస్తూ పొట్టగడుపుకుంటుంది. అయితే ఆగివున్న కారులోకి ఆరేళ్ల బాలుడు ఎక్కి డోర్స్ ను లాక్ చేసుకున్నాడు. అయితే బాలుడు ఎక్కడున్నాడో తెలియక రెండు రోజుల నుంచి తల్లిదండ్రులు వెదుకుతున్నారు.
ఆగి ఉన్న కారులో...
అయితే ఆగి ఉన్న కారులో బాలుడు ఆడుకునేందుక వెళ్లి చిక్కుకుపోయాడు. డోర్స్ లాక్ అయ్యాయి. బయటకు కూడా ఎవరికీ కనిపించలేదు. దీంతో ఊపిరాడక బాలుడు మరణించాడని పోలీసులు తెలిపారు. లాక్ చేసి ఉన్న కారులోకి బాలుడు ఎలా వెళ్లారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story