Thu Dec 19 2024 18:42:28 GMT+0000 (Coordinated Universal Time)
తొక్కిసలాట.. ముగ్గురి మృతి
రాజస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు
రాజస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ లోని శికర్ జిల్లాలోని ఖతు శ్యామ్జీ ఆలయంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఆలయంలో జాతర ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తొక్కిసలాట జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని జైపూర్ ఆసుపత్రికి తరలించారు.
ఆలయ ద్వారాలు తెరుచుకోగానే...
ఆలయ ద్వారాలు తెరుచుకున్న వెంటనే ఒక్కసారిగా భక్తులు లోపలకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Next Story