Fri Dec 20 2024 16:40:01 GMT+0000 (Coordinated Universal Time)
పండగ వేళ విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పండగ వేళ నీటిలో మునిగి నలుగురు మరణించని సంఘటన విషాదం నింపింది
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పండగ వేళ నీటిలో మునిగి నలుగురు మరణించని సంఘటన విషాదం నింపింది. పండగకు సొంతూళ్లకు వచ్చిన మన్నెగూడ వాసులు కోటిపల్లి ప్రాజెక్టును చూసేందుకు వెళ్లారు. అక్కడ నీటిని చూసి దిగారు. లోతు తెలియకుండానే లోపలికి వెళ్లడంతో ఒకరు నీటిలో మునిగిపోతున్నారు. అతనిని కాపాడేందుకు మరో ముగ్గురు ప్రయత్నించి వారు కూడా నీటిలో మునిగిపోయారు.
ఈతకు దిగి...
మరణించిన వారంతా పూడూరు మండలం మన్నెగూడకు చెందిన యువకులుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన యువకులు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడకు వచ్చి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు లోకేష్, జగదీష్, వెంకటేష్, రాజేష్ లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story