Fri Dec 20 2024 20:19:01 GMT+0000 (Coordinated Universal Time)
బస్సు-ఆటో ఢీ : 8 మంది విద్యార్థులకు గాయాలు
ప్రమాద ఘటన జరిగిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు..
ప్రైవేటు బస్సు - ఆటో ఢీ కొన్న ఘటనలో 8 మంది విద్యార్థినులు తీవ్రగాయాలపాలయ్యారు. పుదుచ్ఛేరిలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ప్రమాద ఘటన జరిగిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు అతివేగమే కారణంగా పేర్కొన్నారు. స్కూల్ విద్యార్థులతో వస్తున్న ఆటో - ఎదురుగా వస్తోన్న ప్రైవేట్ బస్సు వేగంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జైంది.
ప్రమాదంలో ఆటోలో ఉన్న 8 మంది విద్యార్థినులతో పాటు డ్రైవర్ కూడా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆటోలో ఉన్నవారిని బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆటో రాంగ్ రూట్ లో వచ్చినట్లు చెబుతున్నారు. కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరామర్శించారు.
Next Story