Mon Dec 23 2024 12:53:22 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లి బారాత్ లో విషాదం.. డ్రైవర్ నిర్లక్ష్యంతో బాలిక మృతి
కారు విండో అద్దాలు తీసి తల బయటికి బారాత్ లో స్టెప్పులేస్తున్నవాళ్లని చూస్తోంది. డ్రైవర్ ఆ విషయాన్ని..
ఇటీవల కాలంలో ఎవరు ఎప్పుడు ఎలా మృత్యు ఒడికి చేరుతున్నారో తెలియకుండా పోతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా గుండెపోటుకు గురై చనిపోతున్నవారు కొందరైతే.. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు ఇంకొందరు. తాజాగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం తండాలో ఓ పెళ్లివేడుకలో విషాద ఘటన జరిగింది.
తండాలో ఓ జంట పెళ్లివేడుక పూర్తైన అనంతరం.. ఇరువురి కుటుంబ సభ్యులు ఘనంగా బారాత్ వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలో ఇంద్రజ అనే బాలిక పెళ్లికుమార్తెకు తోడుగా కారులో కూర్చుంది. కారు విండో అద్దాలు తీసి తల బయటికి బారాత్ లో స్టెప్పులేస్తున్నవాళ్లని చూస్తోంది. డ్రైవర్ ఆ విషయాన్ని గమనించకుండా కారు విండో అద్దాలన్నీ క్లోజ్ చేశాడు. డీజే మోతలో ఆ పాప నొప్పితో ఎంత అరిచినా ఎవరికీ వినిపించలేదు. ఇంద్రజ మెడ విండోలో ఇరుక్కుపోయింది. కొంతసేపటికి ఇంద్రజ విండోలో ఇరుక్కుపోయి ఉండటాన్ని చూసి షాకయ్యారు.
వెంటనే విండో అద్దాలు దించి చూడగా ఆమె చనిపోయింది. ఎంతో ఆనందంగా పూర్తికావాల్సిన పెళ్లి బారాత్ వేడుక.. చిన్నారి మృతితో విషాదాన్ని నింపింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇంద్రజ చనిపోయిందని బంధువులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంద్రజ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Next Story